Header Banner

ఫైబర్ నెట్‌లో షాక్!ముగ్గురు ఉన్నతాధికారులపై జీవీ రెడ్డి వేట!

  Thu Feb 20, 2025 18:06        Business

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది నెలల్లో అన్ని శాఖల్లో పురోగతి ఉందని.. అసలు పురోగతి లేని సంస్థ ఫైబర్ నెట్ అన్నారు. గతంతో పోలిస్తే తాము ఒక్క రూపాయి ఆదాయం కూడా సంపాదించలేదని.. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్‌ నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ప్రకటించారు. ఫైబర్‌ నెట్‌ బిజినెస్ అండ్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ గంధంశెట్టి సురేశ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శశాంక్‌ హైదర్‌ ఖాన్‌, ఏపీ ఫైబర్ నెట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పప్పూ భరద్వాజ తొలగిస్తున్నట్లు తెలిపారు. ఫైబర్ నెట్‌ సంస్థలో మొత్తం 410 మందిని తొలగించాలని ఆదేశాలిచ్చినా ఇప్పటి వరకు వారు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఫైబర్‌ నెట్‌ ఎండీ, ఈడీలు ఆ 410మంది ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై సంతకాలు చేయలేదని.. ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారని వివరించారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

తాము నిర్ణయం తీసుకున్నాక అనుమతి ఇచ్చేందుకు జాప్యం ఎందుకు అని ప్రశ్నించారు జీవీరెడ్డి. గతంలో తొలగించిన వారిని ఇంత వరకు విధుల నుంచి తొలగించలేదని.. కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏంటి ఏంటని ప్రశ్నించారు. ఫైబర్ నెట్‌లోని కొంతమంది ఉన్నతాధికారులు గత ప్రభుత్వంతో చేతులు కలిపారా? అంటూ ప్రశ్నించారు. జీఎస్టీ అధికారులు గత నెలలో ఫైబర్‌ నెట్‌కు రూ.377 కోట్లు జరిమానా విధించారని.. అయినా అధికారులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఫైబర్‌ నెట్‌లో పురోగతి లేదన్నారు. ఫైబర్ నెట్ సంస్థలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నా అధికారులు సహకరించడం లేదని విమర్శించారు. 8 నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్‌ కూడా ఇవ్వలేకపోయామని.. రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేకపోయామన్నారు.

ఫైబర్ నెట్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు జీవీ రెడ్డి . 'విధుల్లో అలసత్వం వహించొద్దు.. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారని.. కానీ ఇక్కడ మాత్రం అసలు మొదలే పెట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తొలగిస్తున్న ముగ్గురు అధికారులు ఏం చేసినా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ 24న తాను 410 మంది ఇర్రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించిన విషయాన్ని జీవీ రెడ్డి గుర్తు చేశారు.. కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆ 410మందికి కోటిన్నర జీతం పని చేయకుండా ఇవ్వాలని.. ఎండీకి వారిని తొలగించడానికి భయమేంటని ప్రశ్నించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #business #fibernet #gvreddy #fibernetchairman